ఆంధ్రప్రదేశ్ లో పునరుత్పాదక ఎకనమిక్ జోన్లు (ఆర్‌ఈజెడ్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఆర్‌ఈజెడ్‌ల ఏర్పాటు గురించి ప్రభుత్వం పేర్కొంది. సౌర, పవన, హైబ్రిడ్, బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తికి ఆర్‌ఈజెడ్‌లను ఏర్పాటు చేయనుంది. పునరుత్పాదక ఎనర్జీ జోన్లనూ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధునిక సాంకేతికతో ఉత్పత్తి చేసే విద్యుత్ ప్లాంట్లకు వీజీఎఫ్ సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది. ఆర్‌ఈ వనరుల కార్పొరేషన్, సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా ఆర్‌ఈజెడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. భవిష్యత్ ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తక్కువ ధరకే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టింది. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌తో కలిసి ప్రాజెక్టులు చేయాలని భావిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటులో ఎలక్ట్రోలైజర్లు కీలకంగా మారాయి. ఎలక్ట్రోలైజర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 25శాతం సబ్సిడీ ఇవ్వనుంది. హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ డెవలపర్‌కు మెగావాట్‌కు రూ.కోటి చొప్పున ప్రోత్సాహం ఇవ్వనుంది. మొదటి 10 గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లకే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. పోర్టుల వద్ద ఏర్పాటయ్యే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లకు రూ.లక్షకే ఎకరా చొప్పున లీజుకు ఇవ్వనున్నారు. బయో ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్లకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
0 Comments