ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అమరావతిలో సమావేశమయ్యారు. గత రాత్రి విజయవాడకు చేరుకున్న ఆయన, మంగళవారం సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖలోని ముడసర్లోవ ప్రాంతంలో గోల్ప్ కోర్టు ఉంది. అలాంటిది అమరావతిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014-19 మధ్య కాలంలో గ్రామీణ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు ఓ ప్రోగ్రాం ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. దీంతో మూలన పడిపోయింది. దాన్ని మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
0 Comments