ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా !


తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగాలేవని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా #AskKTR పేరుతో నెటిజన్లతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మహారాష్ట్రలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా..? అనే ప్రశ్నకు కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం మా ఫోకస్ అంతా మా సొంత రాష్ట్రం తెలంగాణపైనే ఉందంటూ సమాధానం చెప్పారు. హైదరాబాద్ లో నెలరోజులు 144 సెక్షన్ పెట్టడం షాకింగ్ అంశమని.. రాష్ట్రాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ డిజాస్టర్ అని నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మరోవైపు ప్రస్తుత రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదని.. పాలిటిక్స్ లో వారికి ఎందుకు లాగుతున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమీ చేయలేదు. 18 ఏళ్ల ప్రజా జీవితంలో నా కుటుంబ సభ్యులు పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒకదశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నానని.. కానీ ప్రజల కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నట్టు కేటీఆర్ తెలిపారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org