నోకియా 108 4G (2024), నోకియా 125 4G (2024) పేరుతో రెండు 4G ఫీచర్ ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా ఫోన్‌లలో బాగా పాపులర్ అయిన స్నేక్ గేమ్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఫీచర్ ఫోన్‌లు 2 అంగుళాల డిస్‌ప్లేను కలిగి, రెండు వేల వరకు కాంటాక్ట్‌లను సేవ్ చేసుకొనే అవకాశం ఉంటుందని సంస్థ చెబుతోంది. నోకియా కొత్త ఫీచర్ ఫోన్‌లు వైర్‌లైస్ FM రేడియో, MP3 ప్లేయర్‌ను కలిగి ఉన్నాయి. నోకియా 125 4G ఫీచర్ ఫోన్ ఇటీవల ఆవిష్కరించిన నోకియా 110 4G ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉంటుందని తెలుస్తోంది. అదే నోకియా 108 4G స్మార్ట్‌ఫోన్.. HMD 105 4G ఫోన్ తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. నోకియా 108 4G (2024) ఫోన్ 2 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. సుమారు 2000 కాంటాక్ట్‌లను సేవ్ చేసేందుకు అవకాశం ఉంటుందని నోకియా తెలిపింది. నోకియా 108 4G ఫోన్ 128MB ర్యామ్ మరియు 64MB అంతర్గత స్టోరేజీని కలిగి ఉన్నాయి. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. వైర్ మరియు వైర్‌లెస్ FM రేడియోలు, MP3 ప్లేయర్ వాయిస్ రికార్డర్ మరియు డ్యూయల్ ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉన్నాయి. 1450mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే.. 15 రోజుల స్టాండ్‌బై ఉంటుందని సంస్థ చెబుతోంది. ఈ ఫోన్ బ్లాక్, సియార్ రంగుల్లో లభిస్తుంది. అయితే ధర, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో సంస్థ వెల్లడించలేదు. నోకియా 125 4G (2024) 2 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. MP3 ప్లేయర్, వైర్ & వైర్‌లెస్ FM రేడియో, వాయిస్ రికార్డర్, డ్యూయల్ ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ 1000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో సుమారు 2000 కాంటాక్ట్‌లను సేవ్ చేయవచ్చని నోకియా చెబుతోంది. మరియు నోకియా పాపులర్ గేమ్ అయిన Snake Game ను కలిగి ఉంది. 128MB ర్యామ్ మరియు 64MB అంతర్గత స్టోరేజీని కలిగి ఉన్నాయి. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్ బ్లూ మరియు టైటానియం రంగుల్లో లభించనుంది.
0 Comments