మలయాళ నటుడు బాలా ఇటీవల నాలుగో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాహాన్ని ఉద్దేశించి ఆయన చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తనని చూసి పలువురు అసూయపడుతున్నారని అన్నారు. ''మా వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. నా వరకూ నేను రాజు. తను నా రాణి. మా పెళ్లి గురించి తెలిసి ఎవరైనా అసూయపడితే అది వారి తప్పు. అమ్మాయిలు దొరక్క ఇబ్బందిపడే వారందరూ మమ్మల్ని చూసి కుళ్లుకుంటున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ల దగ్గర డబ్బు లేదు. అందుకే అమ్మాయిలు దొరకడం లేదు. నాలుగుసార్లు పెళ్లి చేసుకున్నానని విమర్శిస్తున్నారు. ప్రతి దానిలో తప్పులు వెతకడమే వారి పని'' అని బాలా అన్నారు. బాలాకు గతంలో మూడు వివాహాలు జరిగాయి. మలయాళ గాయని అమృతా సురేశ్‌ను ఆయన మూడో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప ఉంది. అనుకోని కారణాలతో విడిపోయారు. ఆయన తమని మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని, ఇబ్బందులు పెడుతున్నాడంటూ కొంతకాలం క్రితం ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్టు అయిన ఆయన ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. కొన్నిరోజులకే బంధువుల అమ్మాయిని నాలుగో వివాహం చేసుకున్నారు. వయసులో తనకెంటే 18 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని నాలుగో పెళ్లి చేసుకోవడం నెట్టింట చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 'టు మచ్', 'ఛాప్టర్ 6' వంటి తెలుగు చిత్రాల్లో ఆయన నటించారు.
నన్ను చూసి పలువురు అసూయపడుతున్నారు : మలయాళ నటుడు బాలా
by Telugu Lo Computer at October 28, 2024
Labels:
cinema
,
నన్ను చూసి పలువురు అసూయపడుతున్నారు
,
మలయాళ నటుడు బాలా
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment