కాల్వలోకి దూసుకెళ్లిన కారు : ఇద్దరు జల సమాధి !
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండాయపాలెం వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుడివాడ నుంచి పామర్రు వైపు వెళ్తోన్న కారు కొండాయపాలెం వద్దకు రాగానే అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. కాల్వలో నీరు ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఇద్దరు ఊపిరాడక అందులోనే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పామర్రు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు.