మెంతికూరలో ఉండే పోషకాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మెంతికూర మన గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడమే కాకుండా మన శరీరంలో పేర్కొన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తుంది. అజీర్ణం, కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బందులు పడే వారికి మెంతికూర ఉపయుక్తంగా ఉంటుంది. వారికి జీర్ణ సంబంధితమైన సమస్యలు తగ్గడానికి దోహదం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా మెంతికూర చాలా మంచిది అని చెబుతున్నారు డైటీషియన్లు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మన కడుపు నిండిన భావన కలిగించి ఎక్కువ ఆహారం తీసుకోకుండా నిరోధిస్తుంది. డయాబెటిస్ బాధితులకు మెంతికూర ఒక దివ్య ఔషధంగా చెప్పాలి. మెంతికూర రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో కీలక భూమిక పోషిస్తుంది. టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవారు మెంతికూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా మెంతికూర బాగా పనిచేస్తుంది. మెంతికూరలో ఉండే పోషకాలు మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించి మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మం ముడతలు లేకుండా యవ్వనంగా ఉండేలా చేస్తాయి.మెంతికూరలో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. చలికాలంలో మెంతికూరను తినడం చాలా మంచిది. మెంతికూర తినడం వల్ల మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. శరీరంలో వేడిని కూడా మెంతికూర జనరేట్ చేస్తుంది. మన శరీరానికి కావలసిన విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ మెంతికూరను తీసుకుంటే అందుతుంది. మెంతికూర మన హార్మోన్ల అసమతుల్యతను తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. లైంగిక సమస్యలకు కూడా పరిష్కారంగా మెంతుకూరను చెప్పవచ్చు. నెలసరి సమస్యలతో బాధపడేవారు మెంతికూరను తింటే ఆ సమస్య నుంచి కొంతమేరకు బయటపడతారు.
0 Comments