తిరుపతిలో అగ్గిపెట్టె మచ్చపై దాడి !


తిరుపతిలో అగ్గిపెట్టె మచ్చపై స్థానిక యువకులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అగ్గిపెట్టె మచ్చ ఏది చేసినా సరే సెన్సేషన్ అన్నట్టే ఉంటుంది. అతను కొంత కాలంగా యూట్యూబ్ మీడియాకు దూరంగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతను తిరుపతిలోని అమెరికన్ బార్ కు వెళ్లాడు. అక్కడ బాగా మద్యం తాగిన తర్వాత బూతులతో రెచ్చిపోయాడు. ఎవరిని పడితే వారిని తిట్టడంతో అక్కడున్న యువకులు అతన్ని ప్రశ్నించారు. తనను ప్రశ్నించిన యువకులపై కూడా బూతులతో రెచ్చిపోవడంతో ఆ యువకులు మచ్చపై దాడి చేశారు. ఈ ఘర్షణలో వంటిపై ఉన్న బట్టలు కూడా చినిగిపోయాయి. రోడ్డుపైనే అతన్ని చితక్కొట్టారు. అయితే కొడుతున్న సమయంలో కూడా అగ్గిపెట్టె నవ్వుతూ ఉండటం వీడియోలో కనిపిస్తోంది. ఈ దాడి చేసింది ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ దాడిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరేమో అగ్గిపెట్టె మచ్చపై దాడిని ఖండిస్తుంటే, ఇంకొందరేమో బాగా జరిగింది వాడికి అలాగే జరగాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org