Ad Code

హైదరాబాద్‌లో హాష్ ఆయిల్ సీజ్ : నలుగురు అరెస్ట్


హైదరాబాద్ నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సామ్రాట్ హోటల్ వద్ద గుట్టుచప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోదాలు నిర్వహించి మూడు లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు కోసం బాలానగర్ పోలీసులకు అప్పగించారు. మరోవైపు, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అధికారులు 300 ఎంఎల్ హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారంతో రహీమ్ ఉన్నీసా అనే మహిళ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు చిన్న చిన్న బాటిల్స్‌లో నిల్వ చేసిన హాష్ ఆయిల్‌ను గుర్తించి సీజ్ చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu