హైదరాబాద్‌లో గంజాయి అమ్ముతున్న ముగ్గురు మహిళల అరెస్ట్ !
ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న ధూల్‌పేట్‌కు చెందిన గీతాబాయ్, శీలాబాయ్, క్రాంతిలను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరు గత కొంతకాలంగా ఎక్సైజ్ అధికారులకు దొరక్కుండా తిరుగుతున్నారు. వీరు ఏపీ, ఒడిశా నుంచి గంజాయి తెచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.