ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోనీ డి జోర్జి (41) రాణించడంతో ప్రొటీస్ జట్టు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులభంగా చేధించింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు అల్ అవుట్ అవ్వగా కైల్ వెర్నీ (114) అద్భుత సెంచరీతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. దాంతో 106 పరుగుల విజయ లక్ష్యంతో దిగిన దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కగిసో రబడ 6 వికెట్లు తీశాడు. ఇక ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ లో దక్షిణాఫ్రికా 7 లో మూడవ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు 3 టెస్టుల్లో ఓడి, 1 మ్యాచ్ డ్రా చేరుకున్నారు. దింతో ప్రొటీస్ జట్టు ఇప్పుడు 47.62 శాతంతో నాలుగో స్థానానికి చేరుకుంది. మరోవైపు ఓడిన బంగ్లాదేశ్ జట్టు 30.56 శాతంతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ 2023-25లో 3 టెస్టులు గెలిచింది, 6 ఓడిపోయింది. దక్షిణాఫ్రికా ఆధిక్యంలో ఉండటంతో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు టేబుల్‌లో వాటి స్థానాలు దిగజారాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు 44.44 శాతంతో ఐదో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఆడిన 9 టెస్టుల్లో 4 గెలిచి 5 ఓడిపోయింది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 43.06 శాతంతో ఆరో స్థానానికి చేరుకుంది. ఇక ప్రస్తుతం భారత జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 8 టెస్టుల్లో విజయం సాధించగా, 3 ఓడిపోయింది. ఇది కాకుండా 1 మ్యాచ్ డ్రా అయింది. భారత్ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు రెండో స్థానంలో ఉంది. 8 టెస్టుల్లో నెగ్గి, 3 టెస్టుల్లో ఓడిన కంగారూ జట్టు 62.50 శాతంతో ఉంది. శ్రీలంక క్రికెట్ జట్టు 55.56 శాతంతో 4 విజయాలతో మూడో స్థానంలో ఉంది.
0 Comments