స్మార్ట్‌ఫోన్‌లో 'డిజిటల్‌ కండోమ్‌' ?


డిజిటల్‌ కండోమ్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ కండోమ్‌ బ్రాండ్‌ బిల్లీబాయ్‌ తీసుకొచ్చింది. ఇన్నోసియన్‌ బెర్లిన్‌తో కలిసి ‘కామ్‌డోమ్‌’ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. దీనినే డిజిట్ కండోమ్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ యాప్‌ను ప్రైవసీ కోసం తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్‌ సమయాల్లో జంటల మధ్య ప్రైవసీని ఇది కాపాడుతుంది. ముఖ్యంగా వీడియోకాల్స్‌ చేసే సమయంలో ఎదుటి వ్యక్తులు రికార్డ్‌ చేసి వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్న సంఘటనలు చూసే ఉంటాం. అయితే మీ ఫోన్‌లో ఈ యాప్‌ ఉంటే ఎదుటి వ్యక్తి కాల్‌ రికార్డ్ లేదా వీడియో రికార్ చేయకుండా అడ్టుకుంటుంది. ఒకవేళ రికార్డ్‌ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే మీకు అలర్ట్‌ వస్తుంది. ఇది బ్లూటూత్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. యాప్‌ను స్వైప్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కెమెరా, మైక్రోఫోన్ వంటివి ఆఫ్ అవుతాయి. ఇప్పటికే ఈ యాప్‌ను 30 కంటే ఎక్కువ దేశాల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఐఓఎస్‌ యూజర్లకు కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org