భారత్, చైనా సరిహద్దుల్లో సైనికుల ఉపసంహరణ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై భారత్ దృష్టిపెట్టిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ సింగ్ తెలిపారు. సరిహద్దుల వద్ద కేవలం బలగాల ఉపసంహరణకే పరిమితం కాకుండా భారత్ మరింత పురోగతి సాధించాలని కోరుకుంటోందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అయితే దీనికి మరికొంత సమయం పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్, చైనా సరిహద్దుల్లో కొన్నిచోట్ల వివాదాల పరిష్కానికి దౌత్య, సైనిక అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయని, దాని పలితంగా పరస్పర భద్రతపై ఓ సమగ్ర అవగాహన వచ్చినట్లు తెలిపారు. సరిహద్దుల్లో బలగాలను వెనక్కి పిలిపించే కార్యక్రమం దాదాపు పూర్తయిందని, వాటి తర్వాత ఏం చేయాలన్న దానిపైనే ఇప్పుడు దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు.
0 Comments