దేశంలో నేడు మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గితే.. నేడు రూ.600 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.490 తగ్గితే.. రూ.650 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.80,450గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750గా నమోదవగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,450గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, పూణేలలో 22 క్యారెట్ల ధర రూ.73,750గా.. 24 క్యారెట్ల ధర రూ.80,450గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,900గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.80,600గా ఉంది. వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర కూడా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండిపై వెయ్యి పెరిగి.. రూ.99,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,06,900గా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలలో 99 వేలుగా నమోదైంది. చెన్నైలో రూ.1,08,000గా కొనసాగుతోంది.
0 Comments