Ad Code

సెయింట్ పీటర్స్‌బర్గ్ లో రోడ్లు ఊడ్చి నెలకి రూ. 1,10,000 సంపాదిస్తున్న భారత సాఫ్ట్వేర్ ఇంజినీర్ !


ష్యాలో సెయింట్ పీటర్స్‌బర్గ్ లో భారతదేశానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోడ్లు ఊడుస్తూ డబ్బు ఆర్జిస్తున్నాడు. రష్యాలో వీధులను శుభ్రం చేసే పనివారు కొరతగా వుండటంతో ఇతర దేశాల నుంచి వచ్చినవారికి అవకాశాలు కల్పిస్తోంది. ఉండేందుకు ఇల్లు, తినడానికి భోజన సదుపాయలు కూడా కల్పించి నెలకి రూ. 1,10,000 ఇస్తున్నారు. దీనితో అక్కడ వీధులను శుభ్రం చేసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. భారత్ నుంచి అలా నాలుగు నెలల క్రితం 17 మంది వెళ్లారట. ఇలా వెళ్లినవారిలో ముఖేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా వున్నాడు. గతంలో మన దేశంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏఐ, జీపీటీ వంటి పలు కీలక విభాగాల్లో పనిచేసిన అనుభవం వుందని ముఖేష్ చెప్పాడు. తను ఏ పని చేసినా దాన్ని భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాననీ, చిన్నచూపు చూడనని ముఖేష్ చెపుతున్నాడు.

Post a Comment

0 Comments

Close Menu