3

సంక్రాంతి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 70 అన్న క్యాంటీన్లు ప్రారంభం !


ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి.  అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం రూ.5కే ఇస్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే తిరిగి ప్రారంభించిన అన్న క్యాంటీన్లు, కొద్ది రోజుల్లోనే వారందరి ఆదరణను పొందాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజక వర్గ, మండల కేంద్రాల్లో దాదాపు 70 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహా లు చేస్తోంది. వివిధ దశల్లో ఉన్న వీటి నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు. జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రాంతాల్లో సుమారు 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. 2 లక్షల మందికిపైగా ప్రజలు ప్రతి రోజు భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. పూటకు రూ.5కే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 70 క్యాంటీన్లను మంజూరు చేసింది. పట్టణాలు, నగరాల్లో ప్రారంభించిన 205 క్యాంటీన్లలో ఇప్పటి వరకు 7.20 కోట్ల మందికిపైగా పేదలకు ఆహారం అందించారు. 

Related Post

Previous
Next Post »