కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య !


న్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలోని సీ బ్లాక్ లో ఉన్న ఆమె ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది.గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో నటించిన శోభిత గతేడాది వివాహం చేసుకున్నారు. భర్త సుధీర్ తో కలిసి శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్టు సమాచారం.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org