నోటికొచ్చినట్టు వాగి, ఇప్పుడు కేసులకు భయపడి దాక్కున్నాడు !


గత ప్రభుత్వం అండతో రామ్ గోపాల్ వర్మ నోటికొచ్చినట్టు వాగాడని, ఇప్పుడు కేసులకు భయపడి దాక్కున్నాడని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. గతంలో చంద్రబాబును అవమానపరిచేలా చెత్త సినిమాలను జగనే తీయించాడని, అందువల్లే వర్మను కాపాడేందుకు జగన్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ ఆదేశాలతోనే సామాజిక మాధ్యమాల్లో నీచమైన పోస్టులు పెడుతున్నారని, వర్మ పెట్టిన పోస్టులు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినవేనని బుద్దా ఆరోపించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్ లోని తన ఆర్జీవీ డెన్ లోనే ఉన్నానని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు. నోటీసులపై తాను ఇచ్చిన రిప్లయ్‌పై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తానని, అరెస్ట్‌ చేస్తారనే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశానని తెలిపారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకే ట్వీట్లు పెట్టానని, నా ట్వీట్ల వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని వర్మ చెబుతున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org