3

తెలంగాణలో మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్న భద్రత బలగాలు !


తెలంగాణలోని ములుగు జిల్లాలో ఎస్పీ శబరీష్ హైఅలర్ట్ ప్రకటించారు. దట్టమైన అడవులు, గిరిజన, ఆదివాసీల ప్రాంతంగా ఉన్న ములుగు జిల్లా ఏజెన్సీలో తాజాగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్ అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.ఈమధ్య కాలంలో జిల్లాలో ఇంతటి ఎన్‌కౌంటర్ జరగకపోవడంతో మావోయిస్టులకు ఇదో చావు దెబ్బగానే చూస్తున్నారు. గ్రే హౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన వాళ్లు కాకుండా మరికొందరు పారిపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పోలీసుల హై అలర్ట్ ప్రకటించారు. అదే విధంగా ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే వారికై గట్టి నిఘా పెట్టారు.అడవిలో కూంబింగ్ చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా ఎస్ఐ కుశ కుమార్ తెలిపారు. వరంగల్ ఏటూరునాగారం ప్రధాన రహదారిపై వచ్చే పోయే వాహనాల్ని ఆపి పోలీసులు క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వారం రోజుల క్రితం వాజేడు మండలంలో మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్లు అనే నెపంతో ఇద్దర్ని హతమార్చారు. మావోయిస్టుల దుశ్చర్యను సీరియస్‌గా తీసుకున్న బలగాలు ఛత్తీస్ గడ్, తెలంగాణ బోర్డర్ లో డేగ కన్నేసి ఉంచారు. అటు పోలీసుల బూట్ల శబ్దం..ఇటు మావోయిస్టుల కదలికలతో ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కోలుకోలేని దెబ్బ తిన్న మావోయిస్టులు మళ్లీ ఏవిధంగా కాల్పులకు తెగబడతారో అని స్థానికులు ,ఏజెన్సీ వాసులు భయాందోళన చెందుతున్నారు.


Related Post

Previous
Next Post »