About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label alleged bank fraud amounting to Rs 904.32 crore. Show all posts
Showing posts with label alleged bank fraud amounting to Rs 904.32 crore. Show all posts

బిగ్‌ బజార్‌ అధినేత కిషోర్ బియానీతో పాటు ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు : ముంబై ఎస్బీఐ ఫిర్యాదు

రూ.904.32 కోట్ల బ్యాంకు మోసం ఆరోపణలకు సంబంధించి ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కిషోర్ బియానీతో పాటు ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కిషోర్ బియానీ సోదరుడు, ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన మరో కీలక ప్రమోటర్ రాకేశ్ బియానీ పేరును కూడా చేర్చింది. నవంబర్ 6న సీబీఐ అధికారులు ముంబైలోని బియానీ, కంపెనీకి సంబంధం ఉన్న పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలోని స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్‌మెంట్ బ్రాంచ్-III ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. నవంబర్ 4న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్‌బీఐతో పాటు తొమ్మిది బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి ఫ్యూచర్ రిటైల్ సంస్థ వివిధ రకాల రుణ సదుపాయాలను పొందినట్లు సీబీఐ పేర్కొంది. ఇందులో వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, టర్మ్ లోన్లు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్ వంటివి ఉన్నాయి. అయితే బ్యాంకులు నిర్దేశించిన ప్రయోజనాల కోసం ఈ నిధులను వినియోగించలేదన్నది ప్రధాన ఆరోపణ. రుణాల రూపంలో పొందిన మొత్తాలను అనుబంధ సంస్థలు, సంబంధిత ఇతర కంపెనీల ద్వారా దారి మళ్లించి, స్వాహా చేసినట్లు ఎస్బీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీబీఐ వెల్లడించింది. దీనివల్ల ఫిర్యాదు చేసిన బ్యాంకుకు రూ.904.32 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆరోపించింది. ఈ వ్యవహారంలో కిషోర్ బియానీ, రాకేశ్ బియానీలతో పాటు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తుల ప్రమేయంపైనా దర్యాప్తు చేపట్టింది. నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. రుణాల నిధులు చివరకు ఎక్కడికి చేరాయి? వాటి వినియోగంలో ఎవరెవరి పాత్ర ఉంది? అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Read More...