About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label Swindles ₹35 Lakhs by Luring Man into 'Investments' for Wedding Expenses. Show all posts
Showing posts with label Swindles ₹35 Lakhs by Luring Man into 'Investments' for Wedding Expenses. Show all posts

మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా పరిచయమైన యువతి : పెళ్లి ఖర్చుల కోసం పెట్టుబడులు పెట్టించి రూ.35 లక్షలు కాజేసిన మాయలాడి

హైదరాబాద్‌లోని మూసాపేట పరిధిలో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కంచి సాయికుమార్ (28)కు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా అడపా కీర్తి అనే పేరుతో ఓ యువతి పరిచయమైంది. కొంతకాలం ఇద్దరి మధ్య పరిచయం కొనసాగడంతో అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి ఖర్చుల కోసం తాను సూచించిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని యువతి సాయికుమార్‌ను నమ్మించింది. ఆమె మాటలు నమ్మిన సాయికుమార్ మొదట రూ.50 వేలు పెట్టుబడిగా పెట్టాడు. కొద్దిరోజుల తర్వాత రూ.8 వేల లాభం వచ్చినట్లు చూపించడంతో ఆమెపై నమ్మకం పెరిగింది. ఆ తర్వాత మరో రూ.లక్ష పెట్టుబడి పెట్టగా రూ.80 వేల లాభం వచ్చినట్లు కనిపించింది. దీంతో భారీగా లాభాలు వస్తాయని ఆశించిన సాయికుమార్ విడతలవారీగా మొత్తం రూ.34,22,866 పెట్టుబడిగా పెట్టాడు. అయితే, పెట్టుబడులకు సంబంధించిన లాభాలను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన సాయికుమార్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మ్యాట్రిమోనీ పరిచయం, పెట్టుబడుల పేరుతో జరిగిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేపట్టారు. యువతి వివరాలు, ఈ మోసంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

Read More...