About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label Establishment of a Rice Outlet with Government-Fixed Prices in Miryalaguda. Show all posts
Showing posts with label Establishment of a Rice Outlet with Government-Fixed Prices in Miryalaguda. Show all posts

మిర్యాలగూడలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల బియ్యం ఔట్‌లెట్ ఏర్పాటు

తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు బియ్యం అమ్మేందుకు ఏర్పాటు చేసిన ఔట్ లెట్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్దేశించిన ధరల బియ్యం ఔట్లెట్ ను ప్రారంభించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం ధరల నియంత్రణలో భాగంగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వం సూచించిన ధరలకే ప్రజలకు బియ్యాన్ని అందుబాటులో తెచ్చేందుకు ముందుకు రావడం పట్ల అభినందించారు. నిర్దేశించిన ధరలతో ఏర్పాటుచేసిన బియ్యం అవుట్లెట్లు ఎల్ నినో ముగిసే వరకు కొనసాగించాలని కోరారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి పేదవాడికి బియ్యం అందుబాటులో ఉండాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం బియ్యం ధరలను నిర్దేశించిందని , ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు కేజీ 66/- రూపాయలకు బియ్యం అమ్మే విధంగా ఔట్లెట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా మిర్యాలగూడలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు బియ్యం అవుట్ లెట్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు రావాలని తెలిపారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే పేద, మధ్యతరగతి, ఉన్నత తరగతుల కుటుంబాలకు బియ్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఎవరు ఎంత బియ్యం కోరిన, ఎన్ని లారీలు కావాలన్నా సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రామ్ పతి నాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశం, మిర్యాలగూడ ఆర్ డి ఓ రమణారెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు బియ్యాన్ని పంపిణీ చేశారు.

Read More...