ఆలయంలో మైనర్‌పై అర్చకుడి లైంగిక వేధింపులు : రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలోని ఓ ఆలయంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలయానికి బయట నుంచి తాళం వేసి ఉండగా, లోపల బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తున్న పూజారిని స్థానికులు పట్టుకున్నారు. ఆలయంలో అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాయన్న అనే వృద్ధుడి బాగోతాన్ని స్థానికులు బట్టబయలు చేశారు. గ్రామ పెద్దలు, స్థానికులు కలిసి అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org