యమహా వైజెడ్ఎఫ్ - ఆర్ 2 విడుదల : సెప్టెంబర్ మధ్య నుంచి డెలివరీలు ప్రారంభం

Telugu Lo Computer
0

దేశీయ మార్కెట్లోకి యమహా వైజెడ్ఎఫ్ - ఆర్ 2ను తీసుకొచ్చింది. స్పోర్టీ డిజైన్‌తో పాటు అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్ 200cc సెగ్మెంట్‌లో ఆసక్తికరమైన మోడల్‌గా నిలుస్తోంది. దీని ప్రారంభ ధర రూ.2,30,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ దీనిని మూడు వేరియంట్లలో, ఐదు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. 2026 సెప్టెంబర్ మధ్య నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. దీనిలో 204cc లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 26.1bhp పవర్, 19.1Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ఇందులో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అందుబాటులో ఉంటుంది. స్పోర్ట్స్ రైడింగ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు కంపెనీ ఈ బైక్‌లో పలు ఎలక్ట్రానిక్ ఫీచర్లను కూడా అందించింది. రైడర్ అవసరాలకు అనుగుణంగా మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. Street Mode, Sport Mode, Rain Mode వాతావరణం, రహదారి పరిస్థితులకు అనుగుణంగా రైడర్ వీటిని మార్చుకోవచ్చు. అంతేకాకుండా అన్ని వేరియంట్లలో Traction Control Systemను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default