సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చిన్నారులకు అసభ్యకర లేదా ప్రతికూల కంటెంట్ అందుబాటులో లేకుండా చేయడం, ఆన్లైన్ మోసాలు, వేధింపుల నుంచి వారిని కాపాడటమే లక్ష్యంగా మెటా నూతన ఫీచర్లను రూపొందించింది. ముఖ్యంగా 18 ఏళ్ల లోపు ఉన్న వినియోగదారుల ఖాతాలను ఆటోమేటిక్‌గా మరింత కఠినమైన ప్రైవసీ నిబంధనలు కలిగిన టీన్ అకౌంట్స్ గా మార్చడం , తల్లిదండ్రుల పర్యవేక్షణ అధికారాలను పెంచడం ఇందులో ప్రధానమైనవి. ఈ కీలక నిర్ణయం వెనుక అంతర్జాతీయంగా సోషల్ మీడియా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిళ్లే ప్రధాన కారణం. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అనేక దేశాలు పిల్లల్లో సోషల్ మీడియా వాడకం తగ్గించడానికి, మానసిక ఆరోగ్య పరిరక్షణకు కఠినమైన చట్టాలను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించగా, అమెరికా , యూరోపియన్ యూనియన్లు టెక్ కంపెనీలపై చట్టపరమైన నిబంధనలను తీవ్రతరం చేశాయి. వివిధ ప్రభుత్వాలు విధించే భారీ జరిమానాలు, చట్టపరమైన ఆంక్షల నుంచి బయటపడటంతో పాటు, ఆన్లైన్ వేదికలను సురక్షితంగా మార్చడానికే మెటా ఈ వ్యూహాత్మక అడుగు వేసింది. భారత్ కూడా ఆ దిశగా అడుగులు ముందుకేస్తోంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం పిల్లల ఖాతాలు బై-డిఫాల్ట్‌గా ప్రైవేట్ మోడ్‌లోకి మారిపోతాయి. వారు ఫాలో చేయని వ్యక్తుల నుంచి నేరుగా మెసేజ్‌లు రాకుండా కఠినమైన ఆంక్షలు ఉంటాయి. అంతేకాకుండా, ఎక్స్ప్లోర్ లేదా రీల్స్‌లో హింస, స్వీయ హాని లేదా అశ్లీలతను ప్రేరేపించే సెన్సిటివ్ కంటెంట్ వారికి కనిపించకుండా 13+ కంటెంట్ రక్షణల ద్వారా ఆటోమేటిక్ ఫిల్టర్లు పనిచేస్తాయి. రాత్రి వేళల్లో నోటిఫికేషన్లను నిలిపివేసే స్లీప్ మోడ్ తో పాటు, పిల్లలు యాప్‌లో ఎంత సమయం గడపాలో తల్లిదండ్రులే నేరుగా నియంత్రించే వెసులుబాటును కూడా మెటా అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త టీన్ అకౌంట్ ప్రొటెక్షన్ నిబంధనలను మెటా దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తోంది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి రాగా, ప్రస్తుతం భారతదేశం వంటి ఆసియా-పసిఫిక్ రీజియన్‌లోని ఇతర ప్రధాన దేశాలలోనూ ఈ కఠినమైన భద్రతా ఫీచర్లు అమల్లోకి వస్తున్నాయి. వయస్సును తప్పుగా నమోదు చేసే పిల్లలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వయో-నిర్ధారణ సాంకేతికతను కూడా మెటా పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది.
3
Beranda
› harassment
› Meta Develops New Features to Protect Minors from Inappropriate Content
› Online Scams
› technology
› under the age of 18 into "Teen Accounts" subject to stricter privacy
› చిన్నారులను అసభ్యకర, ఆన్లైన్ మోసాలు, వేధింపుల నుంచి కాపాడటానికి నూతన ఫీచర్లను రూపొందించిన మెటా !
Subscribe to:
Post Comments (Atom)