Ad Code

విధుల్లో ఉన్న గర్భిణి అయిన మహిళా కానిస్టేబుల్‌పై యువకుడు ఇనుప రాడ్‌తో పాశవికంగా దాడి : నిందితుడిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

బెంగళూరు మెజెస్టిక్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న శిల్ప అనే గర్భిణి అయిన మహిళా కానిస్టేబుల్‌పై ఒక యువకుడు ఇనుప రాడ్‌తో పాశవికంగా దాడి చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 26వ తేదీ తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో, గజేంద్ర అనే యువకుడు తన సెల్‌ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఇతర పోలీసులెవరూ లేకపోవడంతో, ఉదయం ఉన్నతాధికారులు విధుల్లోకి వచ్చాక ఫిర్యాదు చేయాలని శిల్ప అతనికి చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గజేంద్ర బయటకు వెళ్లి, కొద్దిసేపటికే చేతిలో ఇనుప రాడ్‌తో తిరిగి పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి  శిల్ప తలపై ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా బలంగా బాదడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. శిల్ప ఆర్తనాదాలు విని పరుగున వచ్చిన తోటి పోలీసులు, వెంటనే ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు. నిందితుడు గజేంద్రను అరెస్ట్ చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu