Ad Code

నీట్ పీజీ-2026' పరీక్ష : మద్యం తాగి పరీక్షకు వచ్చిన విద్యార్థి : వెనక్కి పంపిన అధికారులు

దేశవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో 'నీట్ పీజీ-2026' పరీక్ష ప్రారంభమైంది. అయితే, రంగారెడ్డి జిల్లాలోని ఒక కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థిని అధికారులు పరీక్ష రాయకుండా తిప్పి పంపిన సంఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని ఒక పరీక్షా కేంద్రానికి ఓ విద్యార్థి మద్యం తాగి హాజరయ్యాడు. కేంద్రం వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు అతడు మద్యం సేవించినట్లు గుర్తించారు. పరీక్షా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో అతడిని పరీక్ష రాయడానికి అనుమతించకుండా వెనక్కి పంపించివేశారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతోంది. దేశవ్యాప్తంగా: దాదాపు 1,300 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.తెలంగాణలో మొత్తం 56 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు, విద్యాశాఖ అధికారులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu