దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం, డిమాండ్ రికార్డ్ స్థాయిలో పెరిగిపోతోంది. జులై 2026 నెలలో భారతీయ బ్యాంకింగ్ సంస్థలు ఏకంగా12.6 లక్షలు కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేశాయి. పండుగల సీజన్ రాబోతుండడం, ఇ-కామర్స్ ఆఫర్లు, డిజిటల్ లావాదేవీల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరగడంతో క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు గణనీయంగా పెరిగాయి. మార్కెట్లో అత్యధిక కార్డులను జారీ చేస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో నెలవారీ ప్రాతిపదికన జూన్ నెలతో పోలిస్తే జులైలో దాదాపు 11.5 శాతం వృద్ధి నమోదవ్వగా, గతేడాదితో పోలిస్తే క్రెడిట్ కార్డుల సంఖ్య దాదాపు 10 శాతం పెరిగింది. వినియోగదారులు డిజిటల్ పేమెంట్లు, రివార్డుల పట్ల మొగ్గు చూపడం ఈ వేగవంతమైన విస్తరణకు కారణమైంది. ఇక క్రెడిట్ కార్డుల ఖర్చులు ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన జులైలో 7.4 శాతం వృద్ధి కనబరిచింది. ఇక నెలవారీ ప్రాతిపదికన 3.4 శాతం పెరిగి రూ.2.08 లక్షల కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 11 మిలియన్ల కార్డులను అధికంగా జారీ చేశారు. జూన్ నెలలో 1.13 మిలియన్ కార్డులను జారీ చేయగా అది ఇప్పుడు 1.26 మిలియన్ కార్డులకు చేరింది. మరోవైపు ట్రాన్సాక్షన్ సంఖ్య సైతం 24.5 శాతం పెరిగి 605.3 మిలియన్లకుకు చేరింది. అయితే, సగటు ట్రాన్సాక్షన్ విలువ 14 శాతం తగ్గి రూ. 3987 నుంచి రూ. 3,440కి పడిపోయింది. అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్లకు సైతం క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నట్లు అర్థమవుతోంది. కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో, నెట్ కార్డ్ అడిషన్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ముందంజలో నిలిచింది. వార్షిక ఖర్చుల వృద్ధి, కొత్త యూజర్ల సంఖ్యలో ఎస్‌బీఐ కార్డ్ బలమైన పోటీని ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జులై నెలలో కొత్తగా 2,30,067 కార్డులను జారీ చేసి టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత ఎస్‌బీఆ కార్డ్స్ సంస్థ 1,83,076 కార్డ్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ 1,70,156 కార్డ్స్, యాక్సిస్ బ్యాంక్ 70,091 కార్డ్స్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను మార్చింది. నిబంధనల సవరణ తర్వాత ప్రధాన బ్యాంకులు కస్టమర్ అక్విజిషన్ మళ్లీ వేగవంతం చేశాయి. చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడంతో డిజిటల్ క్రెడిట్ వృద్ధి బాట పట్టింది. రిటైల్ డిమాండ్ పెరగడంతో క్రెడిట్ కార్డులు తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
0 Comments