దేశీయ మార్కెట్లో సెప్టెంబర్ 3న వివో V80 లైట్ 5G లాంచ్ కానున్నది. ఈ ఫోన్‌లో భారీ 10,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇదే ఫోన్ స్పెషల్ అట్రాక్షన్. ఇందులో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది అతిపెద్ద బ్యాటరీతో వస్తోంది. గతంలో, కంపెనీ 10,200mAh బ్యాటరీతో వివో V600 ప్రోను లాంచ్ చేసింది. ఇందులో ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ గ్రీన్, రోజ్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. బ్యాక్ కెమెరా కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్‌ను మలేషియాలో లాంచ్ చేసేందుకు కంపెనీ ముందుగానే ప్లాన్ చేస్తోంది. వివో V80 లైట్ 5G ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా సెన్సార్ ఉండబోతోంది. దాంతో పాటు అల్ట్రావైడ్ సెన్సార్ సెకండరీ కెమెరా కూడా ఉంది. 8MP కెమెరా కావచ్చు. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. థర్డ్ కెమెరా రింగ్ క్లియర్ కనిపించడం లేదు. వివో ఈ ఫోన్‌లో ఆస్ఫెరిక్ లెన్స్ వాడింది. సర్పేస్ కర్వడ్ పూర్తిగా సర్కిల్ షేప్ కాకుండా ఎడ్జ్ ల నుంచి సెంటర్ వరకు బెండ్ లెన్స్‌లు ఉంటాయి. దాంతో లెన్స్ ఒకే చోట ఎక్కువ లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫోకస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వివో ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫొటోగ్రఫీ కెమెరాను అందించనుంది. ఈ ఫోన్‌లో 10,000mAh బ్యాటరీ అతిపెద్ద ఆకర్షణగా కంపెనీ చెబుతోంది. ఆల్వేస్ పవర్డ్ అనే ట్యాగ్‌లైన్‌తో టీజ్ చేసింది. భారీ బ్యాటరీతో చైనా వెలుపల లాంచ్ కానున్న వివో ఫస్ట్ ఫోన్ ఇదే కానుంది. ఈ ఫోన్ పోస్టర్‌లో పవర్ బటన్ వాల్యూమ్ బటన్లు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి. కర్వ్ డిజైన్, ఎడ్జ్‌లతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇతర స్పెసిఫికేషన్లు ఇంకా రివీల్ కాలేదు. గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో ఈ ఫోన్ 6GB ర్యామ్‌తో కనిపించింది. అయితే, లాంచ్ సమయంలో 8GB వరకు ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లతో రావచ్చు.
0 Comments