దేశీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ పాపులర్ స్కూటర్ జూపిటర్‌కు కొత్త వెర్షన్ జూపిటర్ డ్యూయల్ టోన్ స్పెక్ట్రల్ ను విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్‌లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లతో పాటు పలు కొత్త ఫీచర్లను జోడించారు. 110cc ఇంజన్‌తో వచ్చే ఈ స్కూటర్ ధర రూ.90 వేల లోపే ఉండటం విశేషం. ఎక్స్‌షోరూమ్ ధర రూ.89,825గా నిర్ణయించారు. ఇది స్పెక్ట్రల్ బ్లూ,స్పెక్ట్రల్ కాపర్ డ్యూయల్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ కొత్త జూపిటర్‌కు ప్రత్యేకమైన లుక్‌ను అందిస్తుంది. స్కూటర్‌లోని ఇంటీరియర్ ప్యానెళ్లు, సీటు ఫినిషింగ్‌లో మార్పులు చేశారు. పాక్షిక క్రోమ్ మిర్రర్లు కూడా కొత్త లుక్‌ను అందిస్తాయి. డ్యూయల్ టోన్ స్పెక్ట్రల్ కలర్ ఆప్షన్లతో వచ్చిన తొలి 110cc స్కూటర్‌గా కొత్త జూపిటర్‌ను టీవీఎస్ పేర్కొంటోంది. కొత్త జూపిటర్‌లోని ప్రత్యేక ఆకర్షణల్లో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు ఒకటి. సాధారణ ఇండికేటర్ల మాదిరిగా ఒకేసారి వెలగకుండా, క్రమంగా వెలిగేలా వీటిని రూపొందించారు. దీంతో స్కూటర్‌కు మరింత ప్రీమియం లుక్ వస్తుంది. రైడర్, పిలియన్‌కు మెరుగైన సౌకర్యం అందించేందుకు కొత్త జూపిటర్‌లో ప్రీమియం లాంగ్ సీట్‌ను అందించారు. ఇద్దరికీ మెరుగైన సపోర్ట్ కోసం బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది. సీటు కింద 33 లీటర్ల స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో రెండు హెల్మెట్లను కూడా ఉంచుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. టెక్నాలజీ పరంగా కూడా పలు ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ కనెక్ట్ బ్లూ టూత్ టెక్నాలజీ ద్వారా నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ వంటి సమాచారాన్ని స్కూటర్‌పై యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వేగంగా ఛార్జింగ్ చేసుకునేందుకు USB Type-C ఛార్జింగ్ పోర్ట్ను కూడా అందించారు. కొత్త జూపిటర్‌లో ఇదే 113.3cc సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ కొనసాగించారు. ఈ ఇంజన్ గరిష్ఠంగా 7.9 hp పవర్, 9.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం ఈ స్కూటర్ లీటరుకు 61 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.
0 Comments