ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో పట్టపగలే దారుణ హత్య జరగడం కలకలం సృష్టించింది. స్థాని కొండా వెంకటప్పయ్య కాలనీలో చిన్నా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో నరికి చంపారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో చిన్నా నిందితుడిగా ఉన్నాడు. ఘర్షణల నేపథ్యంలో అతను తెలంగాణలోని సూర్యాపేట వెళ్లి అక్కడే కుటుంబంతో జీవిస్తున్నాడు. గుంటూరులో ఉండే అతడి బాబాయ్ చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆదివారం సూర్యాపేట నుంచి గుంటూరు వచ్చాడు. దీంతో ప్రత్యర్థులు కాపు కాచి చిన్నాపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరులో పట్టపగలు దారుణ హత్య !
by Telugu Lo Computer at August 30, 2026
Labels:
Andhra Pradesh
,
Brutal Broad-Daylight Murder in Guntur
,
Chinna was an accused in a murder case dating back 20 years
,
crime
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment