ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

మిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలోని కర్లబాక్కంలో ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉంది. లోపల నుంచి రోజులుగా దుర్వాసన వస్తోంది. అనుమానంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తలుపులు పగలగొట్టి చూడగా పడకగదిలో ఓ మహిళ కుళ్లిపోయిన స్థితిలో మృతదేహమై కనిపించింది.  కర్లబాక్కం యాదవర్‌ వీధికి చెందిన లత (45) స్థానిక పంచాయతీలో క్లీనర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త సుబ్రమణి ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో లత ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ నెల 20న విధులకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన లత ఆ తర్వాత బయటకు రాలేదు. ఆమె ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అయితే ఆమె ఎక్కడికైనా వెళ్లి ఉంటుందని భావించారు. మంగళవారం లత ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. వెంటనే ముక్తపుదుపేట్టై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ సెల్వి ఆధ్వర్యంలో ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. పడకగదిలో లత తలకు తీవ్ర గాయాలతో, కుళ్లిపోయిన స్థితిలో  కనిపించింది. లత ఒంటిపై ఉన్న ఆభరణాలు, ఇంట్లోని వస్తువులు యథాతథంగానే ఉండటంతో దోపిడీ కోసం హత్య చేసినట్లు పోలీసులు భావించలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెన్నైలోని కిల్పాక్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అవడి ముక్తపుదుపేట్టై పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అదే ప్రాంతానికి చెందిన మునివేల్‌ (65) అనే పాల వ్యాపారితో లతకు కొంతకాలంగా సన్నిహిత సంబంధం ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో మునివేల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో తానే లతను హత్య చేసినట్లు మునివేల్‌ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. చాలా కాలంగా లతతో తనకు సంబంధం ఉందని, ఇటీవల ఆమె పలువురు పురుషులతో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఆ సమయంలో ఆమెపై దాడి చేసినట్లు అతడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మునివేల్‌ను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి వాంగ్మూలం, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org