తెలంగాణలోని కరీంనగర్, కోతిరాంపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఆన్‌లైన్ జూదం ఆటల్లో భారీగా డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలైన వేములవాడకు చెందిన ఓ యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేములవాడ పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన నరాల కార్తీక్ (35) ఆన్‌లైన్ గేమ్స్, క్యాసినో, జూదం ఆటలకు అలవాటు పడ్డట్లు సమాచారం. ఈ క్రమంలో భారీగా డబ్బు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆటల కారణంగా దాదాపు రూ.కోటి వరకు అప్పులు చేసినట్లు సమాచారం. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తీక్.. కరీంనగర్‌లోని కోతిరాంపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఆన్‌లైన్ జూదాల్లో భారీగా డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలైన యువకుడు : ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య
by Telugu Lo Computer at August 31, 2026
Labels:
Driven to despair by financial woes
,
Kothirampur area of Karimnagar
,
telangana
,
Young man commits suicide after incurring heavy debts from online gambling
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment