అమెరికా ఇరాన్‌లోని లారక్ ద్వీపంపై రెండు క్షిపణి లాంచర్లను లక్ష్యంగా చేసుకుంది. హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లను ప్రయోగించేందుకు ఇరాన్ దళాలు సిద్ధమవుతున్నట్లు గుర్తించడంతో ఈ దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించింది. కింగ్ హుస్సేన్, అల్ అజ్రాక్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే జోర్డాన్ సైన్యం తమ గగనతలంలోకి ప్రవేశించిన ఎనిమిది క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. పౌరులు లేదా ఆస్తులకు ముప్పు కలగకముందే వాటిని ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఖార్గ్ ద్వీపం "పూర్తిగా ధ్వంసమైంది" అంటూ సోషల్ మీడియాలో ఓ యానిమేటెడ్ వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేశారు. అయితే ఖార్గ్ ద్వీపం పూర్తిగా ధ్వంసమైందన్న ట్రంప్ వాదనకు ఇప్పటివరకు స్వతంత్ర ధృవీకరించలేదు.
ఖార్గ్ ద్వీపం పూర్తిగా ధ్వంసమైంది : సోషల్ మీడియాలో యానిమేటెడ్ వీడియోను పోస్టు చేసిన డొనాల్డ్ ట్రంప్
by Telugu Lo Computer at August 31, 2026
Labels:
Donald Trump Posts Animated Video on Social Media
,
international
,
Kharg Island Completely Destroyed
,
US targeted two missile launchers on Iran's Larak Island
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment