ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా ఆనందపురం-పెందుర్తి సర్వీస్ రోడ్డులోని గాండ్రిగుండం పరిధిలో ఉన్న సత్తారువు జంక్షన్ వద్ద ఓ కారు లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ వాహనం లోపలే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. జాతీయ రహదారి-16 సర్వీస్ రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న కారు, తన ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారు ఇంజిన్‌లో మొదలైన మంటలు క్షణాల వ్యవధిలోనే వాహనం మొత్తానికి వ్యాపించాయి. దీంతో డ్రైవర్ బయటకు వచ్చే అవకాశం లేక మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకునే సరికే కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఆనందపురం ఎస్ఐ శివ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద సమయంలో కారు నంబర్ ప్లేట్ ఊడిపోయి లారీకి అతుక్కుపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ ఆధారంగా మృతుని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేశారు.
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు : డ్రైవర్ సజీవ దహనం
by Telugu Lo Computer at August 31, 2026
Labels:
Andhra Pradesh
,
Car Rams into Lorry from Behind
,
crime
,
Driver burnt alive
,
located in the Gandrigundam area along the Anandapuram-Pendurthi service road in Visakhapatnam district
,
Sattaruvu Junction
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment