ఆగి ఉన్న కట్టెల లారీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ వోల్వో బస్సు.. 16 మందికి గాయాలు : ఇద్దరి పరిస్థితి విషమం

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబడిపాలెం వద్ద శుక్రవారం తెల్లవారుజామున 71వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కట్టెల లోడు లారీని కర్ణాటక ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా మొత్తం 16 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. కర్ణాటక ఆర్టీసీ వోల్వో బస్సు బెంగళూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తుండగా చెంబడిపాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న కట్టెల లోడు లారీని బస్సు ఢీకొనడంతో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం తీవ్రతతో కొంతసేపు అక్కడ భయానక పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం 16 మందికి గాయాలు కాగా, వారిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురికి నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెరుగైన వైద్యం అవసరం కావడంతో వారిని నెల్లూరుకు రిఫర్ చేసినట్లు సమాచారం. మిగిలిన క్షతగాత్రులకు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కూడా వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ ఆదిలక్ష్మి అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎస్ఐ ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org