Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోశ్ రంకాలను కోర్టు విడుదల చేసింది. రాబోయే ఒక సంవత్సరం పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దనే షరతు, రూ.50 వేల పూచికత్తుపై కోర్టు వారిని విడుదల చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండుతో శనివారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టాలనుకోగా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు వీరిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఢిల్లీ కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ లోని ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరుచగా వారిని విడుదల చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సీజేపీ అగ్రనేతల విడుదల, ఇవాళ జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సీజేపీ ఇన్ చార్జి అజింక్య షిండే ఆధ్వర్యంలో నిరసన కొనసాగనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఆందోళనల్లో రాజకీయ నాయకులు కూడా భాగమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు రోజు కావడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజధాని అంతటా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 30 వేల మందికి పైగా పోలీసులు పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద భద్రతను పటిష్టం చేశారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement