విజయవాడ ఉత్సవ్ 2.0' వేడుకలపై ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడ నగరానికి ఒక విశిష్టమైన స్థానం ఉందని ప్రధాని మోడీ తన లేఖలో కొనియాడారు. విజయవాడ ఉత్సవ్ నిర్వహణ వల్ల పారిశ్రామికవేత్తలకు నూతన అవకాశాలు, మార్గాలు తెరుచుకోవడమే కాకుండా, రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఉత్తేజం లభిస్తుందని ఆకాంక్షించారు. ప్రజలకు, ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి మధ్య ఉన్న బంధాన్ని ఈ వేడుకలు మరింత పటిష్టం చేస్తాయని పేర్కొంటూ, ఈ ఉత్సవంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రధాని శుభాకాంక్షలు అందజేశారు. ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు నగరవ్యాప్తంగా మూడు ప్రధాన వేదికలను సిద్ధం చేశారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం, కృష్ణానది తీరంలోని పున్నమిఘాట్, సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రాంగణాల్లో ఈ కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ముఖ్య అతిథిగా హాజరై 'విజయవాడ ఉత్సవ్ 2.0' వేడుకలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్దపీట వేస్తూ, స్థానిక కళలు, కళాకారులను వెలుగులోకి తీసుకురావడమే ఈ ఉత్సవం ముఖ్య ఉద్దేశమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వెల్లడించారు. ఇప్పటికే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విభిన్న పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో ప్రజలను ఉర్రూతలూగించేందుకు పలువురు సినీ ప్రముఖులు, ప్రముఖ నటీనటులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. సంగీత విభావరిలు, సంప్రదాయ నృత్యాలు, ఫుడ్ ఫెస్టివల్స్, వినోద కార్యక్రమాలతో విజయవాడ నగరం పండుగ శోభను సంతరించుకుంది. పర్యాటకులను, నగర ప్రజలను పెద్ద ఎత్తున ఆకట్టుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Travel the world
Climb the mountains
'Vijayawada Utsav 2.0' Celebrationsand spiritual life of Andhra PradeshculturalPM Modi Sends Best WishesVijayawada holds in the economic
విజయవాడ ఉత్సవ్ 2.0' వేడుకలు : ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment