యూట్యూబర్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ధృవ్ రాఠీని ఢిల్లీ పోలీసులు ఈ వేకువజామున విడుదల చేశారు. జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించ తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునే క్రమంలో గుర్గావ్ లో ఉన్న ఆయన నివాసంలో శనివారం ఉదయం పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. దాదాపు 20 గంటల తర్వాత ఆయనను విడుదల చేశారు. అరెస్ట్ వ్యవహారంపై ధృవ్ రాఠీ ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసులు తనను చట్టబద్ధంగా అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. కిడ్నాప్ చేశారని విమర్శించారు. గుర్గామ్ సెక్టార్ 56 లో ఉన్న తన నివాసానికి శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో దాదాపు 20 మంది మఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చి తనను బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు. జంతర్ మంతర్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, ఆంక్షలను ధిక్కరించి నిరసన స్థలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే మళ్లీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు చెప్పారు. ఇంటి తలుపులు తెరిచిన తల్లిని తోసుకుంటూ మరీ మఫ్టీలో వచ్చారని, బెడ్రూమ్ లో పడుకుని ఉన్న తనను నిర్బంధంలోకి తీసుకున్నారని ధృవ్ రాఠీ వివరించారు. ఇది అరెస్టో లేక డిటెన్షనో కాదని, నేరుగా తనను కిడ్నాప్ చేశారని ధ్వజమెత్తారు. పోలీసులే వచ్చివుంటే వారి ఒంటిపై ఖాకీ దుస్తులు, దానికి నేమ్ ప్లేట్ ఉండేదని, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నామో తెలియజేసే వాళ్లని అన్నారు. అవేవీ లేకుండా సాధారణ దుస్తుల్లో వచ్చి బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు. తాను జర్మనీ పౌరుడినంటూ ఒక వర్గానికి చెందిన మీడియాలో వార్తలు రావడాన్ని తోసిపుచ్చారు ధృవ్ రాఠీ. ఇది శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్ట్ ను ఆయన ఈ సందర్భంగా చూపించారు. ఈ దేశంలో ఓ సాధారణ పౌరుడికి లభించే రాజ్యాంగబద్ధమైన సర్వాధికారాలు కూడా తనకూ వర్తిస్తాయని ధృవ్ రాఠీ వ్యాఖ్యానించారు. తాను భారత పౌరుడినని పునరుద్ఘాటించారు. ఇంట్లో నుంచి లాక్కెళ్లే సమయంలో చెప్పులు వేసుకునే టైమ్ కూడా ఇవ్వలేదని, ఫోన్లు సీజ్ చేశారని అన్నారు.
Travel the world
Climb the mountains
"Not an arrestbut a kidnapping; I am an Indian citizen"Delhi Police released RatheeDigital content creator Dhruv Ratheenational
అరెస్ట్ చేయలేదు, కిడ్నాప్ చేశారు : తాను భారత పౌరుడినే : డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ధృవ్ రాఠీ
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment