ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు సాయంత్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా దుర్గగుడిలో దర్శన వేళల్లో కీలక మార్పులు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు సాయంత్రం 7:10 గంటలకు దుర్గగుడికి చేరుకోనున్నారు. అనంతరం 7:20 గంటల నుంచి 7:40 గంటల వరకు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భద్రతా పరమైన ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి కొండపైకి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు.
Home
national
,
prayers this evening to Goddess Kanaka Durga
,
President Droupadi Murmu to Visit Andhra Pradesh for Two Days Starting Today
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Written By
