ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ

దేశవ్యాప్తంగా చేపడతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ  ప్రక్రియను సవాల్ చేస్తూ ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్ల జాబితాల సవరణ జరుగుతున్న తీరును, ఆ ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలను ఈ పిటిషన్‌లో ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. సరైన నిబంధనలు పాటించకుండా ఈసీ ఇష్టానుసారంగా పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపడుతోందిన అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఫారమ్-6 సమర్పించే సమయంలో మ్యాపింగ్ పేరుతో నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ప్రతిపక్షాల తరఫున ఓవైసీ కూడా న్యాయపోరాటానికి దిగారు. అయితే, ఆన దాఖల చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.

Written By

Amateur Full-Stack Developers and Full-Stack UI Designer • Powered by love and coffee • Portofolio on dribbble.com/sanengineer