ఈసీకి మద్దతుగా 42 మంది వివిధ కోర్టుల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ న్యాయమూర్తులు ఎస్ఐఆర్ తో పాటు ఈసీ నిర్ణయాల్ని సమర్దిస్తూ, ఓట్ల చోరీ ఆరోపణల్ని తప్పుబడుతూ ఓ లేఖ విడుదల చేశారు. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, చట్టబద్ధమైన సంస్థలపై నిరంతరంగా దాడి జరుగుతోందని ఈ లేఖలో మాజీ న్యాయమూర్తులు ఆరోపించారు. ఈ మేరకు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ఒక చట్టబద్ధమైన ప్రజాస్వామ్య హక్కేనని పేర్కొన్నారు, కానీ వ్యక్తిగత దాడులు, చట్టబద్ధతను దెబ్బతీసే స్థాయికి వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజా వేదికల నుండి రాజ్యాంగ అధికారులను దొంగలని ముద్ర వేయడం పెరుగుతోందని ఆరోపించారు. అలాగే ఓట్ల దొంగతనం ఆరోపణల ఆధారాన్ని కూడా మాజీ న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ ఆరోపణలు కోర్టుల ముందు కాకుండా పత్రికా సమావేశాలలో చేస్తున్నారని వారు ఆక్షేపించారు. ఓట్ల దొంగతనం ఆరోపణలు పత్రికా సమావేశాలలో చేస్తున్నారు, కోర్టుల ముందు కాదు. కమిషన్ ప్రమాణపూర్వక ప్రకటనను కోరినప్పుడు, ఏదీ దాఖలు చేయడం లేదని వారు తెలిపారు. ఎన్నికల ఓటముల తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (EVMs) పదేపదే లక్ష్యంగా చేసుకోవడాన్ని కూడా వీరు ప్రశ్నించారు. అవే యంత్రాలను ఉపయోగించి సాధించిన విజయాలపై మాత్రం ప్రశ్నలు రావడం లేదన్నారు. ఓటర్ల జాబితాలను నియంత్రించే చట్టపరమైన చట్రంలో ఇది ఒక భాగమని వారు తెలిపారు. ఎస్ఐఆర్ ను సమర్ధిస్తూ, ఓటర్ల జాబితాలను సవరించడానికి ఎన్నికల సంఘానికి అధికారం కల్పించే 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3)ను వారు ఈ సందర్భంగా ఉదహరించారు. ఎన్నికల సంస్థలపై నిరంతరం సందేహాలు వ్యక్తం చేయడం వల్ల కలిగే పరిణామాల గురించి ఆ లేఖలో మాజీ న్యాయమూర్తులు హెచ్చరికలు చేశారు. ప్రజాస్వామ్యానికి నమ్మకమే మూలధనమని, పౌరులకు వారి ఓటుకు విలువ లేదని పదేపదే చెబితే, వారు ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కోల్పోవచ్చని హెచ్చరించారు.బ్యాలెట్‌కు అర్థం పోయినప్పుడు, వీధులకు ఆ అర్థం వస్తుందన్నారు. ఒక కథనంతోనే అశాంతి మొదలవుతుందంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనాన్ని గుర్తుచేశారు. అప్పుడు ఏర్పడిన శూన్యాన్ని అరాచక, విపరీత శక్తులు ఆక్రమిస్తాయన్నారు. ఎన్నికలను బలహీనపరచడానికి బదులుగా, తమ ఫిర్యాదులను సాక్ష్యాధారాలతో ఎన్నికల సంఘం, కోర్టుల వద్దకు తీసుకువెళ్లాలని సంతకాలు చేసిన మాజీ న్యాయమూర్తులు రాజకీయ పార్టీలను కోరారు.
Post Top Ad
Responsive Ads Here
Thursday, October 8, 2026
Home
42 Former Judges Issue Letter in Support of the Election Commission
alleged that there are continuous attacks on the Election Commission
and statutory bodies
national
the judiciary
ఈసీకి మద్దతుగా లేఖను విడుదల చేసిన 42 మంది మాజీ న్యాయమూర్తులు
ఈసీకి మద్దతుగా లేఖను విడుదల చేసిన 42 మంది మాజీ న్యాయమూర్తులు
Tags
# 42 Former Judges Issue Letter in Support of the Election Commission
# alleged that there are continuous attacks on the Election Commission
# and statutory bodies
# national
# the judiciary
Share This
About Telugu Lo Computer
the judiciary
in
42 Former Judges Issue Letter in Support of the Election Commission,
alleged that there are continuous attacks on the Election Commission,
and statutory bodies,
national,
the judiciary
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Responsive Ads Here
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.

No comments:
Post a Comment