Ad Code

ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు : మా అబ్బాయిని పెళ్ళి చేసుకుంటానని చెప్పిందన్న సాధిక్‌ ఖాన్ తల్లి నూర్జహాన్‌

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారం సాదిక్ వేధింపులు కారణం కాదని సాధిక్‌ ఖాన్ తల్లి నూర్జహాన్‌ తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డిని సాధిక్ చంపలేదన్నారు. సౌజన్య రెండు సార్లు తమ ఇంటికొచ్చిందని, సాధిక్‌ను పెళ్ళి చేసుకుంటానని చెప్పిందన్నారు. ఈ ప్రతిపాదనకు మా కుటుంబం ఒప్పుకోలేదు. జగదీశ్వరరెడ్డి మరణించాక తనను పెళ్లి చేసుకోవాలని సౌజన్య, సాధిక్‌ను ఒత్తిడి చేసిందని సాధిక్ ఖాన్ తల్లి చెప్పుకొచ్చారు. ఈ రిలేషనల్ మంచిది కాదని సాధిక్‌ను మందలించానని, తన భర్త పట్టించుకోవడం లేదని సాధిక్‌తో సౌజన్య రిలేషన్ నడిపిందని సాధిక్‌ ఖాన్ తల్లి నూర్జహాన్‌ ఆరోపించారు. సౌజన్య కొడుకు సాధిక్‌ను అబ్బు అని, తన తండ్రిని ఇడియట్ అని పిలిచేవాడని, రోజు ఫోన్‌లో మా అబ్బాయి చెప్పే కథలు విని సౌజన్య కొడుకు పడుకునేవాడన్నారు సాధిక్‌ ఖాన్ తల్లి నూర్జహాన్‌. సౌజన్య మా ఇంటికి వచ్చి తెలుగు ఖురాన్, బుర్కా కావాలని సౌజన్య అడిగిందన్నారు. చనిపోయిన రోజు సాయంత్రం 5:30కి సాధిక్‌కు సౌజన్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. తన స్టూడెంట్స్ కేరళలో ఈవెంట్స్‌ వెళ్లాలని, రావడం కుదరదని చెప్పి సాధిక్ అకాడమీకి వెళ్ళిపోయాడని సాధిక్‌ ఖాన్ తల్లి నూర్జహాన్‌ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu