యాపిల్ డిస్‌ప్లే క్లీనింగ్ ప్రొడక్ట్ 'పాలిషింగ్ క్లాత్' కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో ఈ క్లాత్ ధర భారత్‌లో రూ. 1,780గా ఉండగా, తాజాగా విడుదల చేసిన ఈ కొత్త వెర్షన్‌ను దాదాపు రూ. 682 తగ్గింపుతో రూ. 1,098 ధరకే అందుబాటులో ఉంచింది. ఈ క్లీనింగ్ క్లాత్ అత్యంత మృదువైన నాన్-అబ్రేసివ్ మెటీరియల్‌తో రూపొందించబడిందని, యాపిల్ ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు మాత్రమే కాకుండా సున్నితమైన నేనో-టెక్స్చర్ గ్లాస్ డిస్‌ప్లేలపై కూడా ఎలాంటి గీతలు పడకుండా సురక్షితంగా శుభ్రం చేసేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ కొత్త జనరేషన్ క్లాత్‌లో డిజైన్ పరంగా లేదా నాణ్యత పరంగా ఎలాంటి నిర్దిష్ట మార్పులు చేశారనే వివరాలను యాపిల్ అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు టెక్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ వార్షిక ఈవెంట్‌కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
0 Comments