Ad Code

రియల్‌మీ C-సిరీస్, 16-సిరీస్ మోడళ్ల స్మార్ట్‌ఫోన్ ధరలు ₹4,000 వరకు పెంపు

రియల్‌మీ పాపులర్ C-సిరీస్, 16-సిరీస్ మోడళ్ల స్మార్ట్‌ఫోన్ ధరలను ఏకంగా ₹4,000 వరకు పెంచేసింది. మెమరీ, చిప్‌సెట్, అలాగే స్మార్ట్‌ఫోన్ విడిభాగాల ధరలు పెరగడం వల్లనే రేట్లు పెంచక తప్పలేదని కంపెనీ భాగస్వాములకు పంపిన సర్క్యులర్‌లో తెలిపింది. ఎంట్రీ లెవల్ C83 5G ఫోన్‌పై ₹1,000 వరకు పెరగ్గా, 16 ప్రో మోడళ్ల ధర అత్యధికంగా ₹4,000 వరకు పెరిగింది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే కొత్త MRP రేట్లను అప్‌డేట్ చేయగా, అమేజాన్‌లో మాత్రం ఇంకా పాత స్టాక్ పాత ధరలకే అందుబాటులో ఉంది. ఇక ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొన్నిరోజుల పాటు పాత రేట్లకే విక్రయించే అవకాశముంది, కాబట్టి తక్కువ ధరకే సొంతం చేసుకోవడానికి ఇదే సరియైన సమయం. రియల్‌మీ ధరలు పెంచినప్పటికీ, మార్కెట్లో ఇంకా అనేక ప్రత్యామ్నాయ మోడళ్లు పాత ధరలకే లభిస్తున్నాయి. ₹10,000, ₹15,000, ₹20,000 బడ్జెట్ విభాగాల్లో ఉన్న ప్రముఖ ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికీ ప్రారంభ ధరలకే అందుబాటులో ఉన్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu