దేశీయ మార్కెట్లో రెడ్‌మీ నోట్ 15 5జీ విడుదలైంది. ఇది 15 5G 4K వీడియో సపోర్ట్‌తో కూడిన అద్భుతమైన 108MP కెమెరా, 6.77-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 చిప్‌సెట్, 5,520mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధర 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 19,999, 8GB RAM, 256GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 21,999 (ప్రారంభ తగ్గింపులతో సహా) నుంచి ప్రారంభమవుతుంది. సేల్ జనవరి 9న Xiaomi అధికారిక వెబ్‌సైట్, Flipkart, Amazon, ఇతర ఛానెల్‌ల ద్వారా ప్రారంభమవుతుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 చిప్‌సెట్ అందించారు. గత జనరేషన్ కంటే కంపెనీ CPU, GPU పనితీరులో వరుసగా 30%, 10% బూస్ట్‌ను ప్రకటించింది. Redmi Note 15 5G 6.77-అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ 3,200 nits పీక్ బ్రైట్‌నెస్, 120Hz పీక్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. TUV ట్రిపుల్ ఐ కేర్ సర్టిఫికేషన్‌తో పాటు వెట్ టచ్‌లకు మద్దతు ఇవ్వడానికి హైడ్రో టచ్ 2.0 టెక్నాలజీతో వస్తుంది. స్క్రీన్ దాని IP66 సర్టిఫికేషన్‌తో డస్ట్ & వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, మల్టీఫోకల్ పోర్ట్రెయిట్ ఆప్షన్స్, 4K వీడియోలకు సపోర్ట్ తో కూడిన 108MP హై రిజల్యూషన్ కెమెరాను కలిగి ఉంది. 20MP సెల్ఫీ కెమెరాను అందించారు. 520mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1.6 రోజుల వరకు ఉంటుంది. 7.35 మిమీ మందం, 178 గ్రాముల బరువుతో, రెడ్‌మి నోట్ 15 5G ఇప్పటివరకు అత్యంత సన్నని రెడ్‌మీ నోట్ అని కంపెనీ తెలిపింది. ఇది బ్లాక్, మిస్ట్ పర్పుల్, గ్లేసియర్ బ్లూ కలర్స్ లో వస్తోంది.
0 Comments