డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి కీలక వడ్డీ రేట్లు తగ్గించాలని అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్‌కు చెబుతూ వస్తున్నారు. కానీ ఫెడ్ రిజర్వ్ ప్రస్తుత ఛైర్మన్ జెరోమ్ పావెల్ అంతగా పట్టించుకోలేదు. ఈ ఏడాది మే నెలలో పావెల్ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో కొత్త గవర్నర్‌గా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే 2017లో పావెల్‌ను నామినేట్ చేసింది కూడా ట్రంపే కావడం గమనార్హం. కెవిన్ వార్ష్ 2006-11 మధ్య ఫెడ్ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఆయన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, అధిక వడ్డీ రేట్లకే మద్దతు ఇచ్చేవారు. తక్కువ వడ్డీ రేట్ల విధానాన్ని వ్యతిరేకించారు. 2008-09 మహా మాంద్యం సమయంలో ఫెడ్ విధానాలను ఆయన ఒప్పుకోలేదు. అప్పట్లో ఫెడ్ బోర్డు సభ్యుడిగా ఎంపికైన అతి తక్కువ వయసున్న (35) వ్యక్తిగా వార్ష్ నిలిచారు. ఇటీవలి కాలంలో తక్కువ వడ్డీ రేట్లకు మద్దతు పలకడం, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టాక ఆయన విధానాలకు వార్ష్ మద్దతివ్వడమే తాజా ఎంపికకు కారణంగా చెబుతున్నారు. అయితే సెనేట్ కూడా సమర్థిస్తేనే ఫెడ్ ఛైర్‌గా వార్ష్ బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా ట్రంప్ ప్రకారం అమెరికాలో కీలక రేట్లు 1% వద్ద ఉండాలి. ప్రస్తుత 3.5% ఆయన అంచనాకు చాలాదూరంగా ఉంది. అందుకే స్వతంత్ర సంస్థ అయిన ఫెడ్‌పై నియంత్రణ కోసమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంచనా.
ఫెడరల్ రిజర్వ్ కొత్త గవర్నర్‌గా కెవిన్ వార్ష్‌ను ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
Saturday, January 31, 2026
america announced Kevin Warsh as the new Federal Reserve Governor Donald Trump international Jerome Powell's term is set to end in May of this year.
No comments:
Post a Comment