అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు మూలాలున్న మధు గొట్టుముక్కల ఉన్నారు. ఆయన చేసిన పొరపాటు అమెరికా భద్రతా వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. గతేడాది వేసవిలో బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే మధు గొట్టుముక్కల ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సున్నితమైన కాంట్రాక్టింగ్ పత్రాలను చాట్‌జీపీటీ పబ్లిక్ వెర్షన్లో అప్లోడ్ చేశారు. ప్రభుత్వ కంప్యూటర్ల నుంచి సమాచారం బయటకు వెళ్లకుండా ఆపే ఆటోమేటెడ్ సెక్యూరిటీ అలారమ్స్ ఈ చర్యతో ఒక్కసారిగా మోగాయి. ఆగస్టు మొదటి వారంలోనే ఇలాంటి హెచ్చరికలు పదేపదే వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ సమయంలో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఉద్యోగులెవరూ చాట్‌జీపీటీ వాడకూడదని నిషేధం ఉంది. కానీ మధు గొట్టుముక్కల తన అధికారంతో ఐటీ విభాగంపై ఒత్తిడి తెచ్చి, తన కోసం ప్రత్యేకంగా అనుమతి పొందారు. "ఆయన బలవంతంగా అనుమతి తీసుకున్నారు, ఆపై దాన్ని దుర్వినియోగం చేశారు" అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసే ఏ డేటా అయినా ఓపెన్ ఏఐ సర్వర్లలో నిక్షిప్తమై, ఇతర వినియోగదారులకు సమాధానాలు ఇచ్చేందుకు వాడబడే అవకాశం ఉంటుంది. మధు గొట్టుముక్కల చుట్టూ ఉన్న వివాదం కేవలం చాట్‌జీపీటీతో ఆగలేదు. అత్యంత రహస్యమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పొందేందుకు ఆయన ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ పాలిగ్రాఫ్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ పరీక్షలో ఆయన విఫలమైనట్లు 'పొలిటికో' కథనం వెల్లడించింది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ పరీక్షను నిర్వహించిన ఆరుగురు కెరీర్ ఉద్యోగులను ఆయన సెలవుపై పంపడం మరింత వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్ విచారణలో ప్రశ్నించగా "తాను విఫలమయ్యాననే వాదనను అంగీకరించను" అంటూ ఆయన దాటవేశారు. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న మధు గొట్టుముక్కల సుమారు 24 ఏళ్ల ఐటీ అనుభవం ఉన్న నిపుణుడు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి రాజకీయ నియామకం పొందిన వారిలో ఈయన ఒకరు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో బీఈ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ డల్లాస్‌లో ఎంబీఏ చేశారు. డకోటా స్టేట్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. రష్యా, చైనా వంటి దేశాల నుంచి ఎదురయ్యే సైబర్ దాడుల నుండి అమెరికా ఫెడరల్ నెట్‌వర్క్‌లను రక్షించడం ఈయన ప్రధాన విధి. మధు గొట్టుముక్కల అప్లోడ్ చేసిన పత్రాలు 'క్లాసిఫైడ్' కానప్పటికీ, అవి అధికారిక వినియోగానికి మాత్రమే అని గుర్తించబడినవి. వీటి లీకేజీ వల్ల దేశ భద్రతకు ఏమైనా నష్టం జరిగిందా అనే కోణంలో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అంతర్గత దర్యాప్తు చేపట్టింది. విచారణలో తప్పు తేలితే ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు కావడంతో పాటు పదవి నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది.
3
Beranda
› acting director of CISA
› america
› Andhra Pradesh
› Madhu Gottumukkala in Trouble
› science
› technology
› US Government Secrets in ChatGPT
› చాట్‌జీపీటీలో అమెరికా ప్రభుత్వ రహస్యాలు : చిక్కుల్లో మధు గొట్టుముక్కల
Subscribe to:
Post Comments (Atom)