ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో నమ్మకంతో వచ్చిన భార్యను అనుమానంతో భర్త గొంతు కోసి చంపాడు. పచ్చని సంసారంలో అనుమానం పెనుభూతంగా మారి, ఇద్దరు చిన్నారులను అనాథలను చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల సమాచారం మేరకు నందిని, శ్రీహరిలకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. గత కొంతకాలంగా భార్య నందిని ప్రవర్తనపై శ్రీహరి అనుమానం పెంచుకున్నాడు. ఈ మనస్పర్థల కారణంగా దంపతులిద్దరూ గత తొమ్మిది నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. నందిని తన జీవనోపాధి కోసం బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. శనివారం ఉదయం బెంగళూరు నుంచి నెల్లూరు చేరుకున్న నందినిని తీసుకెళ్లడానికి శ్రీహరి రైల్వే స్టేషన్కు వెళ్లాడు. అంతా సవ్యంగానే ఉందనుకుని ఆమె భర్తతో కలిసి బయలుదేరింది. అయితే, నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపానికి చేరుకోగానే శ్రీహరి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా నందిని గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘోరాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
3
Beranda
› Andhra Pradesh
› crime
› Husband Kills Wife by Slitting Her Throat Due to Suspicion
› Nellore
› Preliminary investigation revealed that suspicion was the main reason for this murder
› అనుమానంతో భార్యను గొంతు కోసి చంపిన భర్త
Subscribe to:
Post Comments (Atom)