సూపర్ కంప్యూటర్ ఎథీనా ప్రారంభించిన నాసా
నాసా కొత్తగా రూపొందించిన శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ఎథీనా. అడ్వాన్స్‌డ్ టెలిస్కోప్ ఫర్ హై ఎనర్జీ ఆస్ట్రోఫిజిక్స్ (ఎథీనా). అంతరిక్ష మిషన్లను ప్లాన్ చేయడానికి, పనుల వ్యూహాలను లెక్కించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎథీనా అనేది ఒక కొత్త తరం సూపర్ కంప్యూటర్. ఇది అంతరిక్ష ప్రయోగాల రూపురేఖలను మార్చేయగలదు. తన సొంత పనుల కోసం అలాగే అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ పనుల కోసం నాసా ఈ ఎథీనాను రూపొందించింది. కాలిఫోర్నియాలో దీనిని ఏర్పాటు చేశారు. ఎంతో దూరంలో ఉన్న అంతరిక్ష వస్తువుల కదలికలను ట్రాక్ చేయడానికి, వాటికి సంబంధించిన లెక్కలను సిమ్యులేట్ చేయడానికి ఇది నాసాకు సహాయం చేస్తుంది. గతంలో ఉన్న సూపర్ కంప్యూటర్ల లాగానే, నాసా ఈ సిస్టమ్ ద్వారా కేవలం సాధారణ పనులే కాకుండా విశ్వంలోని కొత్త విషయాలను అన్వేషించాలని భావిస్తోంది. ఎథీనా చాలా కష్టమైన మ్యాథమెటికల్ లెక్కలను కేవలం సెకన్లలోనే పూర్తి చేయగలదని నాసా చెబుతోంది. దీని పీక్ పెర్ఫార్మెన్స్ 20 పెటాఫ్లాప్స్ గా ఉంది. అంటే ఇది ఒక సెకనులో 20 క్వాడ్రిలియన్ లెక్కలను చేయగలదు. అయితే ఈ ఎథీనా డిజైన్ లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇది ఇంత శక్తివంతమైనదైనప్పటికీ, ఎంతో ఎఫీషియన్సీతో పనిచేస్తుంది. దీని డిజైన్ వల్ల వేడి త్వరగా తగ్గి కూలింగ్ బాగా జరుగుతుంది. దీనివల్ల రన్నింగ్ కాస్ట్ అంటే నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ సూపర్ కంప్యూటర్ వల్ల మిగిలే డబ్బును భవిష్యత్తులో ప్రయోగించే స్పేస్‌క్రాఫ్ట్ తయారీలో వాడతామని నాసా అంటోంది. నాసా రీసెర్చర్లు అలాగే నాసా ప్రోగ్రామ్స్ కి సపోర్ట్ చేసే బయటి సైంటిస్టులు కూడా ఈ సిస్టమ్ ను వాడుకోవడానికి సమయం కోరవచ్చు అని నాసా ఒక పోస్ట్ లో వివరంగా తెలిపింది. ఎథీనా నాసాకు కొత్త దారులను చూపిస్తుంది. ఇది అంతరిక్ష అన్వేషణను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఈ కంప్యూటర్ సాయంతో నాసా ఏఐ మోడల్స్ తయారు చేస్తుంది. ఇవి మాక్ స్పేస్ మిషన్లు నిర్వహించడానికి తోడ్పడతాయి. దీనివల్ల ఆస్ట్రోనాట్స్ వేరే గ్రహాల కక్ష్యలోకి వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా కచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. నాసా ఈ సిస్టమ్ ను చీఫ్ సైన్స్ డేటా ఆఫీసర్ కు అప్పగిస్తోంది. ఇది వారికి ఒక హైబ్రిడ్ కంప్యూటింగ్ పద్ధతిని అందిస్తుంది. దీని ద్వారా సూపర్ కంప్యూటర్లతో పాటు కమర్షియల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ వంటి ఇతర టూల్స్ కూడా వాడుకోవచ్చు. అలాగే పెద్ద మొత్తంలో ఉండే డేటాసెట్ ను ఎథీనా చదవగలదు. దీనివల్ల ఏదైనా గ్రహం గురించి నాసా పూర్తిగా అధ్యయనం చేసి, ఆ మిషన్ కు సరిపోయే స్పేస్‌క్రాఫ్ట్, లాంచ్ వెహికల్ ను తయారు చేస్తుంది. ఇది నాసా సాధించిన అతిపెద్ద కంప్యూటింగ్ విజయం అనడంలో సందేహం లేదు. ఇది మానవజాతికి కొత్త దారులను చూపిస్తూ అంతరిక్ష భవిష్యత్తును మారుస్తుంది.